Jaikcr.com వెబ్‌సైట్ పాఠకులకు నమస్కారం!!
నేను కేసీఆర్ అభిమానిగా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించాను. ఇందులో రాసే వార్తలు, వ్యాసాలు, విశ్లేషణలు, అభిప్రాయాలు పూర్తిగా నా వ్యక్తిగతం. వెబ్‌సైట్ వెనుక ఎవరి ప్రమేయమూ లేదు. ఈ వెబ్‌సైట్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ఏ సంబంధం లేదు. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఎవరూ దీని వెనుక లేరని స్పష్టం చేస్తున్నాను. వారిపై ఉన్న అభిమానంతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నఅభివృద్ధిని వివరించే ఒక వేదికగా Jaikcr.com వెబ్‌సైట్‌ను ప్రారంభించాను. అంతేకాదు తెలంగాణ అభివృద్ధిని కోరుకునే ఒక సామాన్యుడిగా నిత్యం జరిగే పరిణామాలను, వాటిపై నా అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నాను. అలాగే మన రాష్ట్రం మరింతగా ముందుకు పోవాలంటే ఏం చేయాలో ఒక సగటు మధ్యతరగతి జీవి కోణంలో నాకు స్ఫురించే ఆలోచనలను కూడా తెలియజేసేందుకే ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించాను.