War Between Street BJP And Delhi BJP In Karnataka Elections

కర్ణాటకలో గల్లీ బీజేపీ వర్సెస్ ఢిల్లీ బీజేపీ..!

Share it >>

కర్నాటకలో పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో కమలనాథుల్లో ఆందోళన ఎక్కువైంది..ఓటమి భయం రాష్ట్ర బీజేపీ నేతల్లోనే కాదు హైకమాండ్‌లోనూ కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు కర్నాటక ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..కర్నాటకలో గెలిచి అదే ఉత్సహంలో పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్లేందుకు కమలం నేతలు ఉత్సహపడుతున్నారు..అయితే ఇప్పుడు కన్నడనాటలోనే బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో కాషాయ నేతలు తలలు పెట్టుకుంటున్నారు.

కర్నాటకలో పొలిటికల్ హీట్‌ క్షణక్షణం మారుతోంది..ప్రధాన పార్టీల ప్రచార దూకుడు పెంచాయి..ప్రత్యార్థులపై పైచేయి సాధించేందుకు శ్రమిస్తున్నారు..కాంగ్రెస్‌ ,బీజేపీ, జేడీఎస్‌ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు..ఎవరి స్టైల్లో వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు..ఓటర్ల నాడీ పట్టేందుకు అన్ని పార్టీల నేతలు విరామం ఎరుగని శ్రమజీవుల్లా పని చేస్తున్నారు..బీజేపీ కులాలు మతాలు అంటూ ప్రచారం చేస్తుంటే ప్రతి పక్షాలు అవినీతి, నిరుద్యోగం, 40 శాతం లంచాలు విమర్శల కత్తులు ఎక్కువపెడుతున్నారు..

సర్వేలన్నీ బీజేపీకి వ్యతిరేకమే

జేడీఎస్‌, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వాన్ని దొంగ చాటున కూల్చి గద్దేనెక్కిన బీజేపీ.. ఇప్పుడు మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది..ఈ నేపథ్యంలో కమలానికి కలిసివచ్చే అన్ని అంశాలను రాజకీయంగా ఉపయోగించుకోవాలి ప్రయత్నిస్తోంది.. అయితే కర్నాటకలో పరిస్థితి బీజేపీకి పూర్తి భిన్నంగా ఉంది..సీఎం బొమ్మై సర్కార్‌పై కన్నడీల్లో వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తం అవుతోంది.. మరోవైపు మాజీ సీఎం యడ్డియ్యూరప్ప రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోవడం..బీజేపీ నుంచి వలసలు పెరిగిపోవడం ఇప్పుడు కమలనాథులకు తలనొప్పిగా మారింది.

అంతేకాదు కర్నాటక బీజేపీలో తిరుగుబాటు నేతలు, అసంతృప్తి జ్వాలలతో ఢిల్లీ కమలంపెద్దలకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది.. కర్నాటకలో అన్ని సర్వేలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి..కర్నాటక ఎన్నికల సరళిని దగ్గరగా అధ్యయనం చేస్తున్న స్వచ్చంద సంస్థలు, రాజకీయ విశ్లేషకులు కూడా బీజేపీ ఓటమి తథ్యమని అనాలసిస్‌ చేస్తున్నారు..ప్రధాని మోడీపై అభిమానం కంటే కర్నాటక బీజేపీపై ప్రజల్లో వ్యతిరేత ఎక్కువ ఉందంటున్నారు.

కర్నాటక బీజేపీకి ఓటమి భయం

మరోవైపు కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం ఎక్కువైంది.. ఎన్ని ప్రయత్నాలు చేసిన కన్నడీలు రాష్ట్రంలో కమల పార్టీని విశ్వసించడం లేదు..రాష్ట్రబీజేపీ నేతలపై కర్నాటకల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఢిల్లీ బీజేపీ పెద్దలు కర్నాటకలో మకాం వేశారు..సీఎం బొమ్మైని ప్రచార బాధ్యతలను పూర్తిగా తప్పించి కేంద్రహోం మంత్రి అమిత్‌ షా తన భుజాలకెత్తుకున్నారు..బొమ్మైపాలనపై ఉన్న వ్యతిరేతకతను కప్పిపుచ్చే ప్రయత్నం అమిత్‌ షా చేస్తున్నారు..రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో మళ్లీ పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ప్రచారం షెడ్యూల్‌ సిద్దం చేసుకున్నారు.

ఆశలన్నీ మోదీ-షాలపైనే..!

అయితే ఈసారి కర్నాటక ప్రజలు అమిత్‌ షాను కూడా నమ్మెపరిస్థితుల్లో లేరని అనేక సర్వేలు చెపుతున్నాయి.. కర్నాటక ప్రజల్లో బీజేపీపై ఉన్న అసంతృప్తిని జాతీయ గోడీ మీడియా చూపించకపోయిన…ప్రజల్లో ఆవేశం మాత్రం పైకి నివురు గప్పిన నిప్పులా ఉంది..అగ్నిపర్వం బద్దలైనట్లు ఏ క్షణం అయితే కన్నడ ప్రజల అసంతృప్తి బద్దలు కావచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..అయితే ప్రజల నాడిని పసి గట్టిన బీజేపీ పెద్దలు కర్నాటకకి క్యూ కట్టారు..ప్రధాని మోడి నుంచి ఆర్ఎస్‌ఎస్‌ పెద్దల వరకూ అందరూ బెంగళూరు బాట పట్టారు..ప్రజల్లో రాష్ట్ర బీజేపీ పోగొట్టుకున్న విశ్వాసాన్ని మోడీ, షా ఫేస్‌లను ముందుపెట్టి ఓటర్లను ప్రభావితం చేందుకు రాష్ట్రంలో వరుస ప్రచార కార్యక్రమాలకు పీఎంవో సిద్దం చేసింది. పోలింగ్‌ జరిగే రెండు రోజుల ముందు వరకూ అమిత్‌ షా, ప్రధాని మోడీ ప్రోగ్రామ్స్‌ అన్నింటిని కర్నాటక కేంద్రంగా మార్చారు.

ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి రోజుల తరబడి కర్నాటకలోనే మాకం వేశారు.. ఒకప్పుడు కన్నడ రాజకీయాల్లో చక్రం తిప్పిన కీలక నేతలు బీజేపీ నుంచి హస్తంలోకి వలసలు వేళ్లడంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి అమిత్‌ షా వ్యూహాలు రచిస్తున్నారు.. మరీ ముఖ్యంగా మాజీ సీఎం జగదీష్‌ శెట్టర్‌, మాజీ మంత్రి లక్ష్మణ్ సవాదీ ప్రభావం పార్టీపై పడకుండా ఉండేందుకు పథకరచణ చేస్తున్నారు..ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో అమిత్‌ షా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు..సీఎం బొమ్మైని పక్కన బెట్టి అసంతృప్తం నేతలను బుజ్జగించే పని షా ముందట వేసుకున్నారు.

సీఎం బొమ్మై, యడ్డియ్యూరప్ప మధ్య తారాస్థాయికి విభేదాలు

మరోవైపు సీఎం బొమ్మై, మాజీ సీఎం యడ్డియ్యూరప్పకు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినట్లు లోకల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి..అయితే పార్టీ శ్రేణులు ఆ విషాయాన్ని ధృవీకరిస్తున్నారు..ఈ నేపథ్యంలో సీఎం బొమ్మై, మాజీ సీఎం యడ్డియ్యూరప్పకు మధ్య గ్యాప్‌ను తగ్గించేందుకు అమిత్ షా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు ఎన్నికల్లో పార్టీపై పడుతుందని వారిని బుజ్జగిస్తున్నారు.. ఎన్నికల ముందు ఎప్పుడు బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించదు.. ఓట్ల లెక్కింపు తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది..

అయితే తాజాగా హుబ్లీ ఎన్నికల ప్రచారంలో తానే మళ్లీ సీఎం అని బొమ్మై ప్రకటించుకున్నారు..దీంతో బీజేపీలో కొత్త వివాదం ప్రారంభమైంది..బొమ్మై వ్యాఖ్యలతో అసంతృప్తులు మరింత పెరుగుతున్నారు..ఒకవైపు బొమ్మైపై కర్నాటక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉంది.ఇప్పుడు బొమ్మై తానే సీఎం అని ప్రకటించుకోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మరింత డ్యామేజ్‌ జరుగుతుందని బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

కమ్యూనల్‌ పోలరైజేషన్‌ తిరస్కరిస్తున్న కన్నడీలు

2024 సార్వత్రిక ఎన్నికల ముందు కర్నాటక ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకున్న కమలనాథులు అనేక షాక్‌లు తగులుతున్నాయి.. కమ్యూనల్‌ పోలరైజేషన్‌ను కన్నడీకులు తిరస్కరిస్తుండంతో కమలనాథులు గిలగిల కోట్టుకుంటున్నారు. కర్నాటక మాజీ సీఎం యడ్డియ్యూరప్ప ఒక జాతీయ మీడియాలో మాట్లాడుతూ రాష్ట్రంలో మత రాజకీయాలకు అస్కారం లేదని చెప్పారు..అదే సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం బొమ్మై కూడా కర్నాటకలో హిందూ ముస్తీం వివాదం అంత ఆవశ్యం కాదని..హిజాబ్‌ వివాదం కాడా అంత ప్రాముఖ్యత కాదని చెప్పారు..దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది.. బీజేపీ నేతల ప్రచార వ్యూహం మారింది..ముస్లీం రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు బీజేపీ షాక్‌ ఇవ్వడంతో కమలనాథులు కక్కలేక మింగలేకపోతున్నారు..ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వడంతో బీజేపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టైంది.

ఒకవైపు కర్నాటక బీజేపీ నేతలు రాష్ట్రంలో మత రాజకీయాలకు అస్కారం లేదంటుంటే..ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు మాత్రం రాష్ట్రంలో కుల మత రాజకీయాలు చేస్తుండటంతో ఇప్పుడు కర్నాటక బీజేపీ వర్సెస్‌ ఢిల్లీ బీజేపీ అన్నట్లు కన్నడలో రాజకీయం నడుస్తోంది..ఇప్పటికే కర్నాటకలో కుల సంఘాలు, మత సంఘాలు బీజేపీ దూరం అవుతుండంతో పాటు తాజాగా కమ్యూనల్‌ పోలరైజేషన్‌ను విషయంలో రాష్ట్ర గల్లీ బీజేపీ ఒక స్టాండ్..ఢిల్లీ హైకమాండ్ మరో సాండ్‌ తీసుకోవడంతో కర్నాటక బీజేపీ నేతల్లో, కార్యకర్తల్లో గందరగోళం మొదలైంది..ఏ స్టాండ్‌తో ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలో తెలియక కాషాయ మూక తలలు పట్టుకుంటున్నారు.

ఈ సారి బీజేపీ మత రాజకీయాలకి ఎదురుదెబ్బ కాయమేనా ?

మరోవైపు మత రాజకీయాలపై బీజేపీ ఎదురుదెబ్బ కర్నాటక నుంచే ప్రారంభం అవుతుందంటున్నాయి రాజకీయ వర్గాలు…దేశంలో బీజేపీ మత రాజకీయాలు సృతి మించాయని కర్నాటక ప్రజలు గుర్తించారు..అందుకే అక్కడ మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ నేతలు కర్నాటక ప్రజలు నిదీస్తున్నారు..ప్రచారంలో కమలనాథులను ప్రశ్నిస్తున్నారు 2024 ఎన్నికల్లో మత ప్రచారాన్ని, హిందూ మత పోలరైజేషన్‌ను నమ్ముకున్న కాషాయ మూకను కన్నడీలు తిరస్కరిస్తున్నారు..తమ రాష్ట్రంలో అభివృద్ది జరగాలని అంతే కాని హిందు ముస్తీం రాజకీయాలు అవసరం లేదంటున్నారు కన్నడీలు.

ఎన్నికల వ్యూహాలు మార్చుతున్న బీజేపీ

కన్నడీలు ఆగ్రహాన్ని పసిగట్టిన కమలనాథులు ఎన్నికల వ్యూహాలు మార్చుకున్నారు.. కర్నాటకల ఎన్నికలో అసెంబ్లీ రాష్ట్రానికి చెందినవి మాత్రమే కాదని కర్నాటక ప్రజల జీవితాలను మార్చే ఎన్నికలని కొత్త ప్రచారంతో ముందుకు వస్తున్నారు.ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు మీ పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇచ్చే ఓట్లని విద్యార్థి,యువకు తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నారు…అయితే బీజేపీ మతోన్మాద రాజకీయాలతో విసిగిపోయిన కర్నాటక ప్రజలు కాషాయ నేతల కుటిల బుద్దిపై మండిపతున్నారు..తమ పిల్లల భవిష్యత్‌ కులంలో..మతంలో లేదాని కుండబద్దలు కొడుతున్నారు..తమ పిల్లల ఫ్యూచర్ విద్యా సంస్థల్లో ఉందని..ఉద్యోగ కల్పనలో.. ప్రజాస్వామ్యంలో…రాజ్యాంగ బద్దమైన పాలనలోఉండదని కర్నాటక ప్రజలకు బీజేపీ నేతలకు తేల్చి చెప్పుతున్నారు…కర్నాటకతో పాటు దేశంలో ఎలాంటి పాలన చేస్తోందో తమకు స్పష్టమైన అవగాహణ ఉందని బీజేపీ నేతలకు కన్నడీలు చురకులు అంటున్నారు.

Leave a Comment