ఆత్మగౌరవం, నీళ్లు.. నిధులు..నియామకాల పునాదుల మీద టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది..ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రుల ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకోంది..ప్రొ. జయశంకర్ సార్, కేసీఆర్ సహా కొంత తెలంగాణవాదులు, తొలి దళ తెలంగాణ ఉద్యమకారులు కలిసి హైదరాబాద్ జలసౌధలో ఏప్రిల్ 27న మలిదశ ఉద్యమానికి తెలంగాణ నేల టీఆర్ఎస్ పార్టీకి జన్మనించింది..
కేసీఆర్ నాయకత్వంలో పిడికెడు మందితో టీఆర్ఎస్ ప్రారంభమై, ప్రత్యేక రాష్ట్రం సాధించి..తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపారు..నేడు దేశ ప్రగతి కోసం, రైతు రాజ్యం కోసం బీఆర్ఎస్ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్తో ఆనాడు తెలంగాణ తల్లి విముక్తి కోసం పోరాటం చేస్తే..నేడే బీఆర్ఎస్తో భరతమాత బంగారు భవిత కోసం తెలంగాణ సమాజం పోరాటుడుతోంది.
బీఆర్ఎస్ పై మరింత పెరిగిన బాధ్యత
తెలంగాణ రాష్ట్రసమితి ఏర్పడేనాటికి తెలంగాణ ప్రాంతం వలవాదుల కబంధ హస్తాల్లో బంధిగా మారింది..సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ప్రాంతం అనేక అవమానాలు ఎదుర్కొంది..అధిపత్య అహంకారంలో తెలంగాణ ప్రజలను మనుషులుగానే గుర్తించ లేని పరిస్థితి అప్పట్లో ఉండేది..310 జీవోను తుంగలో తొక్కిన సీమాంధ్రులు…నిధులు, నీళ్లు , నియామకాల్లో తెలంగాణ ప్రజలకు అన్యాయం గత పాలకులు చేశారు..తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కంటే ముందు చాలా మంది బుద్ది జీవులు ,మేధావులు సీమాంధ్రులపై తిరబడ్డారు…కేసులు , కాల్పులు, ఎన్కౌంటర్లతో తొలి దశ తెలంగాణ పోరాటాన్ని అతి దారుణంగా అణచివేశారు.
ఉద్యమ సింహామై గర్జించిన తెలంగాణ
తెలంగాణ సమాజం ఎన్ని సార్లు అణచివేతకు, రాజకీయ పార్టీల ద్రోహాలకు గురైన ఎప్పుడూ ధిక్కార స్వరాన్ని వదిలి పెట్టలేదు..ఎన్ని అడ్డుంకులు , అణచివేతలకు గురైనా ఫీనిక్స్ పక్షిలాగ మళ్లీ మళ్లీ ఉద్యమ పునర్జీవితాన్ని తెలంగాణ నేల అందిపుంచుకుంది.. తెలంగాణ సమాజంపై సీమాంధ్రులు అణచివేత దోరణి ఎక్కువ అవడంతో మరోసారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం పురుడుపోసుకుంది..తొలి దశ ఉద్యమం నుంచి గుణపాఠాలు నేర్చుకున్న మేధావి వర్గం కేసీఆర్ నాయకత్వంతో మలి దశ తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీ పురుడుపోసుకుంది..ఉద్యమ అకాంక్షను సమైఖ్య పాలకులు ఎంత అణచి వేయాలని చూస్తే అంతకు రెట్టింపు ఉత్సహంతో ప్రజలు తిరుగబడ్డారు..ఉద్యమ సింహాలై గర్జించారు.
తెలంగాణపై సమైక్య వాదులు కక్ష
టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై అనేక మంది సమైక్యవాదులు అనేక రకాల జోష్యాలు చెప్పారు. పార్టీ నిర్మాణం కాకుండా చాలా అడ్డుకుంటు వలసవాదులు సృష్టించారు.. టీఆర్ఎస్ పార్టీ మగలో పుట్టింది..పుగలోపోతోంది అంటూ తెలంగాణ ప్రజల మనోధైర్యాన్ని బెబ్బతీసేలా సమాఖ్యపాలకు వ్యంగంగా అవహేళనే చేస్తూ మాట్లాడారు..అప్పటి నుంచి తెలంగాణ ప్రాంతంపై సమాఖ్య వాదులు మరింత కక్షపూరింగా వ్యవహరించారు..నిధులు, నియామకాలు, నీళ్ల కేటాయింపుల్లో పక్షపాతంగా వ్యహరించారు..తెలంగాణ సమాజంపై అణచివేతను మరింత పెంచారు..ఉద్యమంలో పాల్గొంటున్న వారిని బెదిరింపులకు గురిచేయండం..కేసులు పెట్టడం..అదుపులోకి తీసుకున్న వారిని రోజుల తరబడి కోర్టులో ప్రవేశపెట్టకుండ జైళ్లో చిత్రహింసలకు గురిచేయడం సర్వసాధారణం అయిపోయాయి.
కేసీఆర్ వ్యూహాలకు తేలిపోయిన సమైక్యవాదులు
సమైక్య పాలనకు తెలంగాణ ఉద్యమాన్ని ఎన్ని రకాలుగా అణచాలని వేయాలని ప్రయత్నించిన కేసీఆర్ వ్యూహం ముందు తెలిపోయారు..కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పోరాటం రోజు రోజుకు మరింత ఉదృతం అయింది..మేధావులు, బుద్దిజీవులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, టీచర్లు కేసీఆర్ వెంట నిలిచారు..ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు పెన్ డైన్ చేశారు..కవులు, కళాకారులు కదం తొక్కారు..తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆటపాటలతో ప్రజల్లోకి తీసుకెళ్లారు..ధూం ధాంతో తెలంగాణ పల్లెల్లో ఉద్యమం ఊపందుకుంది. సంబండ వర్గాలు టీఆర్ఎస్ పార్టీకి వెన్నంటి నడిచారు..జై తెలంగాణతో పల్లెలు మారుమోగాయి.పసి పిల్ల నుంచి పండు ముసలివాళ్ల వరకూ అందరిది ఒకటే నినాదం అదే జై తెలంగాణ…జై కేసీఆర్.
ఉత్కంఠ భరిత క్షణాల మధ్య తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష
టీఆర్ఎస్ నేతృత్వంలో తెలంగాణ నేల ఉద్యమ నినాదాలతో మారుమోగింది.. వందలాది ఆత్మబలిదానాలు, కోట్లాది మంది ప్రజల రక్తంతో తెలంగాణ నెల తడిసిపోయింది. రక్తంతో తడిసిన తెలంగాణ నేల మరింత మంది ఉద్యమకారులకు జన్మించింది.. అంతేకాదు సింహం ఒక అడుగు వేసేది మరింత ఉత్సహంతో ముందుకు దూకేందుకే అన్నట్లు కొన్ని సార్లు తెలంగాణ ఉద్యమం సాగింది..పాలకుల ఆలోచనకు అందకుండా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు..ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనేక ఆటు పోట్లు, అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించి ప్రజల పోరాటం ముందు విఫలం అయ్యారు..అనేక ఉత్కంఠ భరితమైన క్షణాల మధ్య తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది.
తిట్టినోళ్లకు చెప్పుతో కొట్టినట్లు కేసీఆర్ పాలన
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది..సీఎం కేసీఆర్ నాయకత్వం అభివృద్ధిలో వెనక్కి తిరిగి చూడలేదు..అప్పటి వరకూ తెలంగాణ వారికి పాలన చేయడం సాధ్యం కాదన్న వారికి చెప్పుతో కొట్టినట్లు పాలన చేస్తున్నారు..తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుంది జోష్యం చెప్పిన వారికి గువ్వగూయ్ మనేలా రైతుల 24 గంటల ఉచిత విద్యుత్ టీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది.
సమైక్య పార్టీలకు రాజకీయ సమాధి
ప్రత్యేక తెలంగాణ ఏర్పాడితే నక్సలిజం ,టెర్రరిజం, ఉగ్రవాదం పెరుగుతుందని.. హైదరాబాద్ మరో పాకిస్థాన్ అవుతుంది..రాష్ట్రానికి పెట్టుబడులు రావని తెలంగాణ ప్రజలను భయ బ్రాంతులకు గురిచేసిన సమాఖ్య పాలకులు ఇప్పుడు తెలంగాణ అభివృద్దిని, సంక్షేమ పాలనను చూసి అసూయపడుతున్నారు..అప్పట్లో తెలంగాణపై విషయం చిమ్మి , తెలంగాణలో నివసిస్తున్న ఏపీ ప్రజలను భయపెట్టిన వారికి ఇటు తెలంగాణలోనూ అటు ఏపీ ప్రజలు రాజకీయ సమాధి కట్టారు..అలాంటి వారు ఇప్పుడు తెగిన గాలి పటంలాగా పార్టీల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
అబ్కీ బార్ కిసాన్ సర్కార్ లక్ష్యంగా అడుగులు
అభివృద్దిలో, సంక్షేమంలో ఇప్పుడు తెలంగాణ దేశంలో చాలా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది..ఇదే అభివృద్ది ,సంక్షేమాన్ని దేశ ప్రజలకు అందించాలని టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారింది..తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఉత్సహాన్ని దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణపై సీఎం కేసీఆర్ పెట్టారు..ఈ నేపథ్యంలోనే తెలంగాణ గడ్డ మరో ఉద్యమానికి సిద్దమైంది..దేశంలో పుష్కలమైన సహజ వనరులు ఉన్నప్పటీకి అవి కార్పోరేట్ గద్దల పాలే అవుతున్నాయి..దేశానికి అన్నం పెట్టే రైతు బతుకు రోజు రోజుకు చితికిపోతోంది..ఒకవైపు ప్రకృతి వైపరిత్యాలు మరో వైపు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విధానాలతో అన్నదాత రోడ్డున పడుతున్నాడు.. అబ్కీ బార్ కిసాన్ సర్కార్‌ను లక్ష్యంగా పోరాటానికి తెలంగాణ రాష్ట్రం కేంద్ర బిందువు కానుంది..తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నేరవేర్చిన టీఆర్ఎస్ పార్టీ…బీఆర్ఎస్తో దేశ రాజకీయాలను శాషించేందుకు రైతు కేంద్రంగా ప్రజా క్షేత్రాన్ని ఎంచుకుంది.
రైతు రాజ్యమే లక్ష్యంగా బీఆర్ఎస్
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది..నేడు దేశ ప్రగతి కోసం, రైతు రాజ్యం కోసం బీఆర్ఎస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది..టీఆర్ఎస్తో ఆనాడు తెలంగాణ తల్లి విముక్తి కోసం పోరాటం చేస్తే..నేడే బీఆర్ఎస్తో భరతమాత బంగారు భవిత కోసం తెలంగాణ సమాజం పోరాటుడుతోంది.. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమ నేపథ్యం, అభివృద్ధి స్పూర్తితో బీఆర్ఎస్లో జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది.. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత తొలి ఆవిర్భవ దినోత్సవం జరుపుకుంటుంది.
బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు వ్యంగాస్త్రాలు
అయితే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. తెలంగాణలో పరిస్థతులకు దేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తేడాలు ఉన్నాయి. అయితే సీఎం కేసీఆర్ విజన్, పట్టుదల ముందు అవన్నీ పెద్ద అంశాలు కావంటున్నారు విశ్లేషకులు..తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంతకన్న పెద్ద పెద్ద సవాళ్లను టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొని స్వరాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేస్తున్నారు.. తెలంగాణ పోరాటంలో కేసీఆర్ అనేక ఆటు పోట్లు, గెలుపు ఓటములను చూసారు.. ఢక్కా మొక్కీలు తిన్నారు.
ఉద్యమానికి ప్రతిబంధకాలుగా ఉన్న పరిస్థితులను కూడా తన రాజకీయ చాణక్యతలో ఉద్యమానికి అనుకూలంగా మార్చుకున్నారు. .ఇప్పుడు దేశంలో ఉన్న క్లిష్ట పరిస్థితులను అబ్ కీబార్ కిసాన్ సర్కార్ ఏర్పాటుకు ఏలా మార్చుకోవచ్చే సీఎం కేసీఆర్‌కు చాలా బాగా తెలుసంటున్నారు రాజకీయ విశ్లేషకులు..నాటు టీఆర్ఎస్ పార్టీని కూడా సమాఖ్య పాలకులు ఇలానే భపట్టించారు..టీఆర్ఎస్ పోరాటంపై వ్యంగాస్త్రాలు చేశారు..చివరికి స్వరాష్ట్రం సాధించి సమాఖ్య పాలకు చెప్పచెల్లుమని పించారు..ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీపై కూడా కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు వ్యంగాస్త్రాలు చేస్తున్నారు..2024 ఎన్నికల తర్వాత సమాఖ్య పాలకు చెప్పిన బుద్దే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెప్పేందుకు సీఎం కేసీఆర్ వ్యూహత్మంగా దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరిస్తున్నారు.
జాతీయ రాజకీయాల్లో కీలకంగా కేసీఆర్ వ్యూహాలు
దేశం క్లిష్ట సమయంలో టీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది..దీంతో జాతీయ స్థాయిలో గులాబీ పార్టీపై మరింత బాధ్యత పెరిగింది..దేశంలో బీజేపీ నియంతృత్వ పోకడ ఎక్కువైంది..ప్రజల పక్షానా కొట్లాడాల్సిన ప్రతి పక్షకాలు విఫలం అయ్యాయి.. అలాంటి సమయంలో బీఆర్ఎస్ నేషనల్ పాలిటిక్స్‌లో రావడంతో గులాబీ పార్టీకి కత్తిమీద సాములాంటిందే.. దేశం గత కొంత కాలంగా అనేక సవాళ్లును ఎదుర్కొంటుంది..అనేక సమస్యలతో దేశ ప్రజల సతమతం అవుతున్నారు. రాజకీయంగా శూన్యతను ఇండియా ఎదుర్కొంటోంది.
నిరుద్యోగం, అధిక ధరలు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో బీజేపీ పార్టీ విఫలం చెందింది..పన్నుల పేరుతో సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డీ విరుస్తోంది..దేశంలో అంతర్గత సమస్యలు ఎక్కువైయ్యాయి..కేంద్ర ప్రభుత్వం చేతగా తనం వల్ల సరిహద్దులో శత్రు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి..చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించాల్సిన సమస్యలు బీజేపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కాషాయ మూక మరింత జఠిలం చేస్తున్నారు.ప్రజలను కులాలు మతాలుగా విభజించి బీజేపీ పాలిస్తోంది. కులా కుంపట్లు మతాల మారణహోమం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటోంది. ప్రజలు చైతన్యం కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కమలనాథులు రెచ్చగొట్టుతున్నారు. ఉన్మాద రాజకీయాలకు పురిగొల్పుతున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తెలంగాణలో కంటే భిన్నమైన సవాళ్లు దేశం వ్యాప్తంగా ఎదురయ్యే చాన్స్ ఉంది..కుల, మత రాజకీయాలపై బీజేపీని ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ కు అనేక కొత్త సవాల్లు స్వాగతం పలుకుతాయి..సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి దేశంలో మతాలుగా విడిపోయిన మనుషులను ఏకం చేయడంలో తొలి సవాల్ స్వాగతం పలుకుతోంది..ఉత్తరాది, దక్షిణాదిగా..హిందీ హిందీయేత పాంత్రాలుగా విడిపోయిన దేశాన్ని ఏకం చేయాల్సిన బరువైన బాధ్యత బీఆర్ఎస్ పార్టీపై ఉంది.
కుల మతాలకు అతీతంగా ఉద్యమం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కుల మతాలకు అతీతంగా ఉద్యమంలో సంబండ వర్గాలను ఏలా అయితే భాగాస్వాములను టీఆర్ఎస్ పార్టీ చేసిందో…ఇప్పుడు దేశంలో కూడా అలాంటి చైనత్యాన్ని తీసుకువచ్చి బీజేపీ కబంద హస్తల్లో బంధీగా ఉన్న భరతమాత దాస్య శృంఖాలల విముక్తికై బీఆర్ఎస్ కృషి చేయాలంటున్నారు మేధావులు.. బీఆర్ఎస్ పార్టీ దేశంలో కులమత సామరస్యాన్ని సాధించడం ద్వారా జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా పటిష్టైన వ్యవస్థగా బీఆర్ఎస్ ఉద్భవిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఉమ్మడి జాతీయ ఎజెండా
ఇంకోవైపు బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్ పార్టీ అనేక వ్యూహాలను అమలు చేయాలి..బీజేపీ గుర్రాలు, ఎలక్షన్ స్ట్రాటజీలుగా చెప్పుకునే అమిత్ షా, మోడీలకు ఊహకందని ఎత్తులు వేయాలి..తెలంగాణ ఉద్యమకాలం నాటి వ్యూహాలకు బీఆర్ఎస్ మరింత పదునుపెట్టాలి..భిన్న సంస్కృతి సంప్రదాయాలు, కులమాలు, భాషాలకు భారత్ నిలయం అయింది..ఆయా రాష్ట్రాల్లో సంస్కృతి, సంప్రదాయాలకు అధ్యయనం చేస్తూ వారి మనో భావాలకు ఇబ్బందులు కలగకుండా ఉమ్మడి జాతీయ ఎజెండాను వీలైనంత తొందరగా దేశ ప్రజల ముందు పెట్టాలి..దీంతో ఆయా రాష్ట్రాలప్రజల్లో బీఆర్ఎస్పై మరింత విశ్వాసం పెరుగుతోంది.
ప్రజల్లో విష బీజాలు నాటుతున్న కాషాయ మూక
బీజేపీ కుల్లు రాజకీయాలను దేశ ప్రజల ముందు గుట్టు ఇప్పి చేప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ ఉంది..ప్రజలను కుల మతాలుగా కమలనాథులు ఎలా విడగోడుతున్నారో అర్థం అయ్యేలా చెప్పాలి..యువత చైతన్యం కాకుండా ఉన్మాద రాజకీయాలను ఎలా రెచ్చగొట్టుతూ వారి మెదల్లో విష బీజాలు కాషాయ మూక వేస్తోందో తొక్కవలిచి నోట్లో పెట్టినట్లు బీఆర్ఎస్ శ్రేణులు వివరించాలి..జాతీయ భావాలు, మోడీ చరిష్మా, అభివృద్ధి సంక్షేమంతో సమాధానం చెప్పాలి..మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ధీటుగా అభివృద్ధి మంత్రంలో ప్రజల విశ్వాసం పొందాలి..మోడీని వర్సెస్ కేసీఆర్..అభివృద్ధి వర్సెస్ మతోన్మాదం..అమీర్ వర్సెస్ గరీబ్ అంటూ ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాలంటున్నారు విశ్లేషకులు.
ఇప్పటికే అబ్కీ బార్ సర్కార్ నినాదంలో దేశంలో గ్రామ స్థాయి వరకూ బీఆర్ఎస్ పార్టీ చేరుకుంది..సీఎం కేసీఆర్ ఇచ్చిన స్లోగన్ ఒక్క నినావదంగానే కాకుండా ఒక ఉద్యమంగా మారింది..చాలా రాష్ట్రాల్లో అబ్కీ బార్ సర్కార్ నినాదం అధికార పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అబ్కీ బార్ సర్కార్ స్లోగన్‌ను రైతులు ముందుకు తీసుకుపోతున్నారు..మద్దతు ధర, ఎరువులు, విత్తనాలు, మార్కెట్ సౌకర్యాలను సాధించడంతో బీఆర్ఎస్ నినాదం ఒక మంత్రంగా మారింది.
ఈ నినాదంతో ప్రభుత్వాలు దిగివస్తున్నాయి.. రైతుల సమస్యలను పరిష్కారిస్తున్నాయి. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎంట్రీలో అక్కడి రైతు సమస్యలను మహారాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించింది.. రైతులకు పెట్టుబడి సాయం ఇస్తుంది..ఒక్క మహారాష్ట్రలోనే కాదు.. యూపీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ నినాదం ఒక ఉప్పెనగా మారుతోంది..అయితే ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవాలి.. ఆయా రాష్ట్రాల్లో రైతులతో నిత్యం టచ్‌లో ఉండాలి..బీఆర్ఎస్పై నమ్మకాన్ని మరింతంగా పెంచుకునేందుకు ఎక్కువ కష్టపడాలి..రైతు పోరాటాలు రైతు ఉద్యమాలకు బీఆర్ఎస్ అండగా నిలవాలని దీంతో దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్కు మరింత బలం పెరుగుతుందంటున్నారు రైతు సంఘాల నేతలు.
బీజేపీ వ్యూహాలకు ఎప్పటికపుడు చెక్ పెడుతున్న బీఆర్ఎస్
మరోవైపు దేశంలో ప్రజల నుంచి కాంగ్రెస్ దూరం కావడానికి గల కారణాలపై బీఆర్ఎస్ అధ్యాయనం చేయాలి..ఏడు దశాబ్దాలు దేశాన్ని ఏకపక్షంగా ఏలీనా హస్తం పార్టీ ప్రజల విశ్వాసాన్ని ఎందుకు కోల్పొయిందో, గ్రాండ్ ఓల్డ్ పార్టీ వైఫల్యల ఎక్కడుందో గులాబీ నేతలు స్టడీ చేయాలి కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యూహత్మక తప్పిదాలను బీఆర్ఎస్ చేయడకుండా బలమైన , స్పష్టమైన ఎజెండా గులాబీ శ్రేణు్లో తీసుకురావాలి..కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల గుణపాఠాల నుంచి బీఆర్ఎస్ కు కొత్త రాజకీయ ఎత్తులు అవుసరం..అందుకు కోసం బీజేపీ వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగడుతు బీఆర్ఎస్ తన వ్యూహాలు మార్చుకునేందుకు ఎన్నికల స్ట్రాటజీ కమిటీ ఉండాలంటున్నారు విశ్లేషకులు.
జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పై మరో అతిముఖ్యమైన బాధ్యత ఉంది..రైతులు కేంద్రంగా పార్టీ ఎజెండా ఉన్నప్పటికీ నిరుద్యోగం, యువత ,విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది..దేశంలో యువతను నిర్వీర్యం చేస్తూ..పాఠ్యాపుస్తకాలనుంచి చరిత్ర తొలిగింపు విద్యాను కాషాయికరించే ప్రయత్నాన్ని గట్టిగా తిప్పికోట్టాలి..కుల మత, జాతీయత భావాల పేరుతో బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పుకొడుతూ యువత నిరుద్యోగులు, మహిళలను చైతన్యం పర్చాలి..అందుకోసం విద్యార్ధి ,యువజన సంఘాలతో పాటు అన్ని అనుబంధ సంఘాలను పరిష్టపర్చాలి..బీజేపీ ప్రాపగండాకు మూల కారణం ఆయిన సోషల్ మీడియాకు ధీటుగా బీఆర్ఎస్ కౌంటర్ ఉండాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..ఒక్క రైతు సమస్యలతోనే బీజేపీని ధీకోట్టకోపోవడం సాధ్యం కాదని రైతులతో ఇతర జాతీయ ఇష్యూలపై గులాబీ స్పష్టమైన ఎజెండాతో మందుకు వస్తే 2024లో బీఆర్ఎస్కు తిరుగు ఉండంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్.