Cases registered against BJP brokers

బీజేపీ డర్టీ పొలిటిక్స్.. ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బీజేపీ రూ. 100 కోట్ల ఆఫర్

Share it >>

హైదరాబాద్‌: మునుగోడు ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీని నేరుగా ఢీకొట్టలేక బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నది. మునుగోడులో ఓటమి ఖాయమని తేలడంతో.. టీఆర్ఎస్ పార్టీ స్థైర్యాన్ని ఎలాగైనా దెబ్బతీసేందుకు బీజేపీ నేతలు కుట్రలకు తేరలేపారు. డబ్బుసంచులతో తన అనునాయులను హైదరాబాద్ పంపిన బీజేపీ.. టీఆర్ఎస్ నేతలను కోనుగోలు చేసేందుకు ప్రయత్నించి ఘోరంగా దెబ్బతిన్నది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డిలను బిజినెస్ డీల్ పేరిట.. మోయినాబాద్ లోని పీవీఆర్ ఫామ్ హౌజ్ కు రప్పించిన బీజేపీ బ్రోకర్లు.. ఎమ్మెల్యేలతో బేరసారాలు చేయడం ప్రారంభించారు. ఒక్కోక్కరికి 100 కోట్లు ఇస్తామని ఆఫర్ పెట్టింది.

bjp-brokers

ఎమ్మెల్యేల బేరసారాల తతంగాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్నిహితుడు నందు(డెక్కన్ ప్రైడ్ హోటల్ ఓనర్) ఆధ్వర్యంలో జరిగాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేరసారాలకు ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సోమయాజుల స్వామిజీలను బీజేపీ రంగంలోకి దింపింది. వీరితోపాటు ఢిల్లీ నుంచి డబ్బు సంచులతో వచ్చిన నలుగురు బీజేపీ బ్రోకర్లు ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపారు.

బిజినెస్ డీల్ పేరు చెప్పి హోటల్ కి రప్పించి.. బేరసారాలు మొదలుపెట్టగానే.. వెంటనే అప్రమత్తమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ధైర్యంగా వారిని మాటల్లో పెట్టి.. విషయాన్ని పోలీసులకు చేరవేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. హోటల్ లో డబ్బుల సంచులను చూసి షాక్ అయ్యారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కుట్రలను మీడియా ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారు. బీజేపీ కుట్రలను బట్టబయలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెలపై తెలంగాణ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Comment