కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ.. ఆ పార్టీ నాయకులంతా రాబందులే అని తృణమూల్ ఎంపీ శంతను సేన్ అన్నారు. ఆ పార్టీతో జాగ్రత్తగా ఉండాలని.. ఎప్పుడు ఎవరి కళ్లలో పొడుస్తుందో ఊహించలేమని సూచించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి.. పబ్బం గడుపుకోవటం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన అన్నారు.
అయితే కుట్రలు, కుతంత్రాలు చేసే బీజేపీని బెంగాల్ ప్రజలు అస్సలు పట్టించుకోరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీజేపీ కష్టాల్లో ఉంది. ఏ క్షణంలో అయినా ఆ పార్టీ, కేంద్ర ప్రభుత్వం కూలిపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. వర్గాల మధ్య చిచ్చు పెట్టి బతికే ఏ పార్టీ ఎక్కువ రోజులు ఉండదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.