BRS Party First Plenery Grand Success

బీఆర్ఎస్‌ తొలి ప్లీనరీ గ్రాండ్ సక్సెస్..!

Share it >>

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ తొలి ప్లీనర్‌ భేటీ సుదీర్ఘ సమయం సాగింది..ప్లీనరీ వేదిక నుంచి అసెంబ్లీ ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ శంఖారావం పూరించారు..ఎన్నికలకు ఎలా సిద్దం కావాలో పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ పాయింట్ పాయింట్ వివరించి దిశానిర్ధేశం చేశారు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లను బీఆర్ఎస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు…ఎమ్మెల్యేలు , పార్టీశ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు..నేతలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని..దళిత బంధులో అక్రమాలకు పాల్పడిదే ఎమ్మెల్యేలదే బాధ్యత అని సీఎం కేసీర్‌ హెచ్చరించారు.

ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్

తెలంగాణ భవన్‌ బీఆర్ఎస్‌ పార్టీ 23వ ఆవిర్భవదినోత్సవం అట్టహసంగా జరిగింది. బీఆర్ఎస్‌ అధ్యక్షుడు , సీఎం కేసీఆర్ అధ్యక్షత ప్లీనరీ సమావేశం జరిగింది..రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 300 మంది ప్రతినిధులు ఈ ప్లీనరీకి హజరయ్యారు..ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ఎన్నికల టైం సమీపిస్తుండటంతో పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు..తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ఉద్దేశ్యంలో రాష్ట్రంపై బీజేపీ అనేక కుట్రలు చేస్తుందని..బీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యక్తరలు వాటిని తిప్పికోట్టాలని సూచించారు..రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను డిసెంబర్‌లో కాకుండా ముందుకు జరిపే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్యేలను హెచ్చరించారు..ప్రజా ప్రతినిధులు అవినీతికి, వివాదాలకు దూరంగా ఉండాలని వార్నింగ్‌ ఇచ్చారు..వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్..పార్టీకి నష్టం కలిగించే వారిని ఉపేక్షించేదే లేదని..ఎన్నికల్లో టికెట్‌ కాదు కదా..పార్టీ సభ్యత్వం కూడ ఉండదని సీఎం కేసీఆర్‌ కుండబద్దలు కోట్టారు.

ముల్లును ముల్లునుతోనే తీస్తున్నకేసీఆర్

మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు, బీఆర్ఎస్‌ పార్టీ విస్తరణపై ప్లీనరీ వేదికగా బీఆర్ఎస్ నేతల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగం కొత్త ఉత్సాహాన్ని నింపింది..ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షుడి స్పీచ్‌ పార్టీ క్యాడర్‌లో జోష్‌ నింపుతుంది..ఎన్నికల్లో రెట్టింపు ఉత్సహం పార్టీకి మరింత బలాన్ని కలిగిస్తుంది..ఇంకోవైపు ప్లీనరీలో సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు..దేశంలో బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక, అప్రస్వామ్యపాలనకు చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు..కుల మతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్న కమలం పార్టీ పూనాదులను కూల్చివేయాలని సీఎం కేసీఆర్ నొక్కి చేప్పారు..విచారణ సంస్థలతో విపక్షాల ముక్త్‌ భారత్‌ కోసం పని చేస్తున్న ప్రధాని మోడీ, అమిత్‌షా మెడలు వంచాలని.. అందుకోసం జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్‌ పార్టీ కీలక పాత్ర పోషించాలని అందుకోసం నేతలందరూ సిద్దంగా ఉండాలి సూచించారు..దేశంలో రాజకీయ శూన్యత ఉన్న నేఫథ్యంలో దేశ రక్షణ కోసం బీఆర్‌ఎస్‌ అవాశ్యకత ఎంతైనా ఉందని సీఎం కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు చెప్పారు..జాతీయ స్థాయిలో బీఆర్ఎస్‌ పోషించాల్సిన పాత్రపై పార్టీ నేతలను మానసింగా సీఎం కేసీఆర్‌ సిద్దం చేశారు.

ఎవరూ బీజేపీ ట్రాప్‌లో పడొద్దు

ఈ నేఫథ్యంలోనే తెలంగాణలో బీజేపీ చేస్తున్నసైకలాజికల్ వార్‌పై పార్టీ నేతలను సీఎం కేసీఆర్‌ అప్రమత్తం చేశారు..రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు ప్రజలను బీజేపీ నేతలు మానసింగా ఎన్నికలకు ఎలా సిద్దం చేస్తుందో తెలిపారు..పదే పదే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఓటర్లను ప్రభావితం చేస్తున్న తీరును పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ వివరించారు..పార్టీ నేతలు ఎవరూ బీజేపీ ట్రాప్‌లో పడోద్దని కేసీఆర్ సూచించారు.ప్రత్యార్థులపై చిల్లమల్లర ఆరోపణలు చేయడం బీజేపీ పుట్టుకలోనే ఉందన్నారు.. బీఆర్‌ఎస్ శ్రేణులు ఎవరూ కూడా బీజేపీ చిల్లర నేతలు చేసే విమర్శలు పట్టించుకోవద్దని..అనవసరంగా వారికి ప్రాధాన్య ఇవ్వొద్దన్నారు సీఎం కేసీఆర్‌..సరైన టైంలో పార్టీ స్పందిస్తుందని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

సైకలాజికల్‌ వార్‌.. సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీ..!

తెలంగాణలో ప్రజలపై బీజేపీ చేస్తున్న సైకలాజికల్‌ వార్‌ను తిప్పికొట్టేందుకు సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నారు.. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు ఏలాగైతే ప్రజలను మానసిక బీజేపీకి అనుకూలంగా సిద్దం చేస్తుందో…అదే వ్యూహాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు..తెలంగాణలో బీజేపీని రాజకీయంగా బొందపెట్టేందుకు ప్రజలను మానసికంగా సన్నద్దం చేస్తున్నారు..తెలంగాణలో బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రధాన ప్రతిపక్షం అంటూ విష ప్రచారం చేస్తుంటే..అసలు తెలంగాణలో బీఆర్ఎస్‌కు బీజేపీ పోటీనే కాదని స్పష్టం చేశారు..బీజేపీ కావాలనే పదే పదే రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రతిపక్షం అని ప్రాపగండ చేస్తున్నారు..బీఆర్ఎస్‌ శ్రేణులు బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలంటున్నారు.

వంద సీట్లు ఖాయం

మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యర్థి కానేకాదని మంత్రి కేటీఆర్ అనేక సందర్భంలో ప్రకటించారు..తెలంగాణలో కాంగ్రెస్సే తమ ప్రధాన రాజకీయ శ్రత్రువుని స్పష్టం చేశారు…వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌-కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉంటుందని తెలిపారు..బీఆర్ఎస్‌ వందకు పైగా సీట్లు గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని..కేసీఆర్‌ మూడోసారిగా సీఎం బాధ్యతలు స్వీకరించి సౌత్‌ ఇండియాలో తొలి సీఎంగా రికార్డ్‌ సృష్టిస్తారని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు..2018 ఎన్నికల్లో 108 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని…2023 అసెంబ్లీ ఎన్నికల్లో100పైగా నియోగజకవర్గాల్లో డిపాజిట్‌ కూడా రాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు..కాంగ్రెస్‌కు మాత్రం కొన్ని సీట్లు వస్తాయని అదే బీఆర్ఎస్‌కు ప్రత్యర్థి అని కేటీఆర్ తెలిపారు.

రేవంత్‌ పై బాహంటంగానే విమర్శలు

ఇక ఇంకోవైను తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి మరోలా ఉంది.. రాష్ట్రంలో హస్తానికి బలమైన క్యాడర్‌ ఉన్నప్పటికీ బలమైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడుతున్నారు..ఢిల్లీ హైకమాండ్‌ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో తెలంగాణలో హస్తం కనుమరుగు అవుతోంది..టీకాంగ్రెస్‌ అధ్యక్షుడి చిల్లర రాజకీయాలు, ఏకపక్ష నిర్ణయాల తీసుకుంటు దుందుడుగా వ్యవహరించడంతో సీనియర్‌ నేతలు అసంతృప్తితో పార్టీ వీడుతున్నారు..ఇంకా కోంత మంది పార్టీలో ఉంటూనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు..రేవంత్‌ రెడ్డి తీరుపై సీనియర్‌లు బాహంటంగానే విమర్శిస్తున్నారు..

మోడీ షా, కాంగ్రెస్ ముక్త్‌ భారతే వ్యూహం

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హైకమాండ్ చేసిన తప్పే టీకాంగ్రెస్ చేస్తోంది..బీజేపీ ట్రాప్ లో పడిన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తనకు తానే రాజకీయ గొయ్యి తీసుకుంటుంది..ప్రధాని మోడీ, అమిత్ షా కాంగ్రెస్ ముక్త్‌ భారత్‌ వ్యూహంలో హస్తం నేతలు తెలియకుండానే పడుతున్నారు..ప్రధాని మోడీ బలమైన నేతగా ఎదిగేందుకు కాంగ్రెస్‌ పార్టీ పరోక్షంగా సహకరిస్తోంది..తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ నేతల ట్రాప్‌లో పడ్డారు.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ఒకేఒక లక్ష్యంతో కమలం పార్టీ ఎదుగుదలకు పాటుపడుతున్నారు.. టీకాంగ్రెస్ నేతల చేతగాని తనంతోనే రాష్ట్రంలో బీజేపీకి ఉనికి కొనసాగుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

భావ దారిద్య్రంలో గ్రాండ్‌ ఓల్డ్ పార్టీ

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్‌ ముక్త్ తెలంగాణలో భాగంగా బీజేపీ చేస్తున్న విమర్శలకు హస్తం నేతలు సరిగ్గా స్పందించలేని స్థితిలో హస్తం నేతలున్నారు.. ప్రజలపై కాషాయ మూక సైకలాజికల్ వార్ను హస్తం పార్టీ అంచనా వేయలేకపోతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ కు మేమే ప్రధాన ప్రతిపక్షం అని బీజేపీ ప్రచారం చేసుకుంటున్న దానికి కౌంటర్ ఇవ్వలేని భావ దారిద్య్రంలో గ్రాండ్‌ ఓల్డ్ పార్టీ ఉంది.. కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో బలమైన క్యాడర్‌ ఉన్నప్పటికీ వారికి కాపాడుకునే ప్రయత్నం హస్తం నేతలు చేయడం లేదు..

బీఆర్ఎస్‌కు బీజేపీ అస్సలు పోటీనే కాదు

తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షం అని బండి సంజయ్‌ వంటి వారు పదేపదే మాట్లాడుతూ కాంగ్రెస్‌ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపుతూ కమలం పార్టీ తన బలం పుంజుకుంటుంటే హస్తం నేతలు మాత్రం కౌంటర్‌ ఇవ్వకుండా జీవచ్చంలా ఉంటున్నారు.. ప్రతి పక్ష హోదా కోసం కాకుండా అధికారం కోసం కలలు కంటూ బీజేపీకి లాభం చేస్తున్న మరుగుజ్జు నేతలు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు బీజేపీ అస్సలు పోటీనే కాదని కుండబద్దలు కొట్టి చెప్పుతున్నారు..రాష్ట్రంలో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి..అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ వచ్చే ఎన్నికల్లో, ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టే తమ ప్రత్యర్థి అని పదేపదే చెపుతున్న కూడా చలనం లేని నిర్జీవులుగా హస్తం నేతలు ఉన్నారు..

Leave a Comment