ఏపీలో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం అందుకుంది. విశాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మికుల పక్షాన నిలబడి ఫస్ట్ గెలుపు సొంతం చేసుకుంది. ఏపీలో ఉన్న వైపీసీ, టీడీపీ పార్టీలు ఉత్తరాంధ్ర ప్రజలను గాలికొదిలేస్తే…తెలంగాణ ప్రభుత్వం వారికి అండగా నిలబడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ టేకోవర్ చేస్తామన్న కొద్ది గంటల్లో ఉక్కుసెగ హస్తినకు తగిలింది. ఏపీలో అటు వైసీపీ ఇటు బీజేపీకి జరుగుతున్న నష్టాన్ని పసిగట్టిన కమలం పెద్దలు హుటా హుటినా ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చారు. గతంలో కార్మికులు ఆందోళన ఎంత ఉధృతం చేసిన పట్టించుకోని కేంద్రం బీఆర్ఎస్ ఎంట్రీతో దిగివచ్చింది. గతంలో కార్మికుల పోరాటాన్ని అవమానించేలా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని ఖరాకండిగా పార్లమెంట్ లోపల బడయట కూడా ప్రకటించిన బీజేపీకి బీఆర్ఎస్ సెగగట్టిగా తలిగింది.
సీఎం కేసీఆర్ వ్యూహానికి దిగివచ్చిన కేంద్రం
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోరాటం మరోసారి తన ఉద్యమస్ఫూర్తిని నిలుపుకుంది. ప్లాంట్ ఏర్పాటుకు ఎంత పోరాటం చేయాల్సిందో దాని కాపాడుకోవడానికి అంతకంటే ఎక్కువ పోరాటం చేయాల్సి వస్తోంది..అయితే ప్రైవేటీకరణపై నిన్నటి వరకూ తగ్గేదే లే అన్నట్లు వ్యవహరించిన కేంద్రం.. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు ,తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహత్మక ఎత్తులతో కమలనాథలు దిగొచ్చారు. తాత్కిలికంగా ఇది కార్మికులు, బీఆర్ఎస్ పార్టీ సక్సెస్‌గానే భావించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ప్రజల కోసం ఎందాకైన పోరాడుతా అన్న సీఎం కేసీఆర్ తన మాటలు నిలబెట్టున్నారంటున్నారు. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణపై తాత్కిలికంగా కేంద్రం వెనక్కి తగ్గింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ప్రకటన
కేంద్రం ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గడం వెనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ స్ట్రాటజీ, పోరాట కృషి వంద శాతం ఉంది..గతంలో జనసేన, టీడీపీ, అప్పుడప్పుడు వైసీపీ కూడా ఉక్కు కార్మికుల పోరాటానికి మద్దతు ఇచ్చిన కేంద్రం మాత్రం వారిని పట్టించుకున్న పాపన పోలేదు..కేవలం బీఆర్ఎస్ ఎంట్రీతోనే కేంద్రం దిగి రావటం హర్షించదగ్గ విషయం..నిన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైసీపీ మంత్రులు, నేతలు ఇప్పడు కేంద్రమంత్రి ప్రకటనకు ఏలాంటి సమాధానం చేపుతారని ప్రజలు నిలదీస్తున్నారు.
ఏపీలో బీఆర్ఎస్‌ను అడ్డుకునేందుకే బీజేపీ వ్యూహలు..అందుబాగంగానే కేంద్ర మంత్రి కామెంట్స్.
స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రమే చేతులెత్తేసిందని చేతగాని మాటలు మాట్లాడిని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఇప్పుడు ఏం చేపుతారని ప్రశ్నిస్తున్నారు..కేవలం బీజేపీలో చీకటి ఒప్పందంల్లో బాగంగానే కార్మికులు పోరాటాన్ని అవమానిస్తూ..ప్రజలను మధ్య చిచ్చు పెడుతు వచ్చారని మరోసారి రుజువైంది..విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ చేయకుండా వైసీపీ ప్రభుత్వం కేంద్రం మీద ఏలాంటి ఒత్తిడి పెట్టలేదని స్పష్టం అవుతోంది..తమ రాజకీయ మనుగడ కోసం కేంద్రంలో సంప్రదింపులు చేశామని వైసీపీ చెప్పిందని రుజువైంది..నవ్వు కొట్టనట్లు చేయి నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్లు బీజేపీ-వైసీపీ చేసుకున్న రహస్య ఒప్పందం ఇప్పుడు బట్టబయలైంది..ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేనతో ఏలాంటి ప్రజయోజం జరగదని ప్రజలు చర్చించుకుంటున్నారు..వీళ్లకు బీజేపీతో లోపాయికార ఒప్పందాలు లేకుండా ఇన్ని రోజులు స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయించలేదని ప్రశ్నిస్తున్నారు..ఇది ఖచ్చితంగా ఏపీ ప్రజలు, స్టీల్ ప్లాంట్ కార్మికుల విజయమే అంటున్నారు.
ఏపీలో బీఆర్ఎస్‌ను అడ్డుకునేందుకే బీజేపీ వ్యూహలు..అందుబాగంగానే కేంద్ర మంత్రి కామెంట్స్..
స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర మంత్రి ప్రకటనతో ఏపీ ప్రజల్లో బీఆర్ఎస్‌పై, సీఎం కేసీఆర్ నాయకత్వంపై మరింత విశ్వాసం పెరుగుతుందంటున్నారు విశ్లేషకులు..ఇదే ఉత్సహంలో ఏపీ బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలతో ముందుకు పోతే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చింతంగా గెలుస్తుందనడంలో ఏలాంటి సందేహం లేదంటున్నారు..కేంద్ర మంత్రి ప్రకటనతో ఇప్పుడు ఏపీలో బీఆర్ఎస్ పాత్ర మరింత పెరిగింది..రాష్ట్ర ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ మాత్రమే కొట్లాడుతుందనే నమ్మకం పెరిగింది..అదే సమయంలో బీఆర్ఎస్‌పై ఏపీలో మరింత బాధ్యత పెరిగింది..రాజధాని సహా అనేక సమస్యలను బీఆర్ఎస్ ఇప్పుడు తన భుజాల మీద మోయాల్సిన గురుత బాధ్యత ఉంది.
గత రెండురోజులుగా ఏపీలో విశాఖ ఉక్కు పోరాటం ,బిడ్డింగ్‌లపై జరుగుతున్న రాజకీయం దుమారం అంత ఇంత కాదు..రెండు రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలాయి..ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతి విమర్శలో ఉక్కు నగరం హీటెక్కింది..సీఎం కేసీఆర్ వ్యూహాలను అంచనవేయడంలో వైసీపీ విఫలం చెంది పప్పులో కాలేసింది..అనవసరంగా బీఆర్ఎస్ పార్టీపై మంత్రులపై ఆరోపణలు చేసి చేతులు కాల్చుకుంది..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ కొద్దికాలం వాయిది చేస్తున్నాం అని కేంద్ర మంత్రి ప్రకటించడంతో వైసీపీ నేతలు, మంత్రులు షాక్ కి గురయ్యారు..ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ముఖం చాటేస్తున్నారు..
కార్మికులు ,ఆంధ్రులు మోసం చేసేందుకు ఏపీకి వచ్చిన మంత్రి ఫగ్గన్
మరోవైపు కేంద్ర మంత్రి ఫగ్గన్ ప్రకటనలో ఏపీ రాజకీయ పార్టీలన్నీ సందిగ్ధంలో పడ్డాయి..ఇన్ని రోజులను ఇటు ప్రజలను అటు కార్మికులను నమ్మించి రాజకీయ పబ్బం గుడుపుకున్న తాము కేంద్ర మంత్రి ఒక్క ప్రకటనతో వారి బండారం బయటపడింది..అయితే సీఎం కేసీఆర్ వ్యూహాలు అంచన వేసిన బీజేపీ.. ఏపీలో బీఆర్ఎస్ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఢిల్లీ నుంచి గల్లీకి దిగివచ్చింది..ఏపీలో బీఆర్ఎస్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కోత్త వ్యూహాలు రచించింది.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీఆర్‌ఎస్ బలం పెంచుకుందని అంచనవేసిన కమలనాధులు ప్రైవేటికరణ అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి ఫగ్గన్ ప్రకటించారు…అయితే ఏ రకంగా చూసిన ఏపీలో బీఆర్ఎస్‌కు మైలేజ్ పెరిగినట్లే అంటున్నారు విశ్లేషకులు..బిడ్డింగ్ వేసినా, కేంద్రమంత్రి ప్రకటన చేసిన రెండు కూడా బీఆర్ఎస్‌కు సానుకూల అంశాలే…రాజకీయంగా ఉపయోగపడేవే అంటున్నారు..
మరింత అప్రమత్తంగా ఉండాలంటున్న మేధావులు..నమ్మించి మోసం చేయడంలో బీజేపీ దిట్టా
అయితే కేంద్ర మంత్రి ప్రకటనతో ఏపీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి..ప్రజలను నమ్మించి మోసం చేయడంలో బీజేపీ ప్రపంచంలోనే గొప్ప చరిత్ర ఉంది..అంత ఎందుకు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో…రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలను నిండాముంచిన చరిత్ర కమలనాథుల సొంతం..రాష్ట్ర ప్రభుత్వాన్ని గుప్పింట్లో పెట్టుకుని కేంద్రం అనేక అరాచకాలు చేసింది..ఇప్పుడు కూడా ఇది ఉక్కు కార్మికులకు, ప్రజలకు తాత్కాలిక ఊరట మాత్రేమే..నమ్మించి గొంతుకోసే బీజేపీ…తగిగుడ్డతో ప్రాణం తీసే వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాజకీయ నిపుణుల హెచ్చిరిస్తున్నారు..ఇంకోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్‌పై తాజా ప్రకటనతో మరింత బరువు పెరిగిందంటున్నారు.
ప్రైవేటీకరణనే చేయనప్పుడు మళ్లీ బీఆర్ఎస్‌పై ఎందుకు ఆరోపణలు.
కార్మికులు ,ఆంధ్రులు మోసం చేసేందుకు కేంద్ర మంత్రి ఫగ్గన్ ఏపీకి వచ్చారణ ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఉద్యమం ఉదృతంగా మారడం…బిడ్డింగ్‌లకు ఆహ్వానించడం..దానికి చివరి తేది రేపే కావడంపై ఏపీ ప్రజల్లో అనేక అనుమాలు వ్యక్తం అవుతున్నాయి..కేంద్ర మంత్రి నిజంగానే ప్రకటన చేశారా? లేకపోతే ఉక్కు పోరాటాన్ని బలహీనపర్చేందుకు బీజేపీ కుట్రనా? ప్రశ్నలు కార్మికుల మెదళ్లను తొలుస్తున్నాయి..మరోవైపు కేంద్ర మంత్రి ప్రకటనపై మేధావి వర్గాల్లో కొత్త చర్చలు జరుగుతున్నాయి..ప్రైవేటీకరణ చేసే ఉద్దేశ్యమే కేంద్రానికి లేకపోతే బీఆర్ఎస్‌పై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అన్న అనుమాలు వ్యక్తం చేస్తున్నారు..బిడ్డింగ్ వెనుకు బీఆర్ఎస్ రాజకీయ ఎజెండా ఉందని చెప్పడం ఎందుకంటున్నారు..అంటే కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే స్టీల్ ప్లాంట్‌ను రక్షించే ఉద్దేశ్యం లేనట్లు కనిపిస్తుందని..కేవలం ఏపీలో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదగకుండా అడ్డుకునేందుకే కేంద్రమంత్రి ఫగ్గన్ ప్రకటనను చూడాలంటున్నారు విశ్లేషకులు.