BRS Social Media Counter Attack To BJP Fake News

భ్రష్టాచార జుమ్లా పార్టీ.. బీఆర్ఎస్ సోషల్ మీడియా దూకుడు..!

Share it >>

సోషల్ మీడియాలో కేంద్ర బీజేపీ ఆగడాలని గట్టిగా ఎండగడుతుంది బీఆర్ఎస్. ముఖ్యంగా ట్విట్టర్ లో మోదీ అదానీల అవినీతి బంధంపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్. తెలంగాణ సంక్షేమానికి కేంద్రం నిధులపై కాషాయ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు మరియు నిరాధార ఆరోపణలను తిప్పికొడుతూనే.. బీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలని చూపెడుతుంది. తెలంగాణలో రైతు బంధు, కల్యాణలక్ష్మి, జీఎస్టీ వసూళ్లు, కేంద్ర నిధుల దుర్వినియోగం వంటి వాటిల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ @BJP4India యానిమేషన్ వీడియోను పోస్ట్ చేయడంతో దానికి దీటుగా బీఆర్ఎస్ బదులిచ్చింది.

ట్విట్టర్ లో బీజేపీని “బ్రష్టాచారి జుమ్లా పార్టీ”గా అభివర్ణించింది. అదానీ గ్రూప్‌కు ప్రయోజనం చేకూర్చడానికి నిబంధనలను మార్చి.. అనుకూలమైన విధానాలను మోదీ తయారుచేయించాడని.. బీఆర్ఎస్ వరుస పోస్ట్‌లను ట్వీట్ చేసింది. అదానీ గ్రూప్‌కు ప్రాజెక్ట్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసిందని శ్రీలంక ప్రభుత్వం చేసిన ప్రకటనను ఎత్తి చూపుతూ.. BRS పార్టీ బిజెపిని ఎండగట్టింది. “మీ పార్టీ సుప్రీం నాయకుడి(మోదీ) అవినీతి కథలు తీరం దాటాయి!

జీ2జీ ఒప్పందానికి బీజేపీ కొత్త అర్థం చెబుతోందన్నారు. “ఇది ఇకపై ‘గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్’ అని పిలువబడదు, ఇది గౌతమ్ అదానీ టు గోటబయ రాజపక్సే ఒప్పందం.” అని సెటైర్స్ వేసింది బీఆర్ఎస్. “మన భారత గడ్డపై తక్కువ ధరకు తగినంత బొగ్గు అందుబాటులో ఉన్నప్పుడు అదానీ బొగ్గును ఎక్కువ ధరకు దిగుమతి చేసుకోవాలని సుప్రీం నాయకుడు(మోదీ) రాష్ట్రాలను బలవంతం చేయటం ఏంటని ప్రశ్నించింది బీఆర్ఎస్ సోషల్ మీడియా.

Leave a Comment