Jai-KCR-Photo-01

బీఆర్ఎస్ ఆవిర్భావం.. ఢిల్లీలో మొదలైన కేసీఆర్ హవా.. ఎక్కడ చూసినా..

Share it >>

దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ గురించి.. దాని ఉద్యమ నేపథ్యం గురించి, కేసీఆర్ గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి ప్రస్తుత పరిస్థితుల్లో పరిచయం అవసరం లేదు. ఇటు అభివృద్ధిలో దూసుకుపోతూనే.. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని ఏకి పారేస్తున్న పవర్ ఫుల్ పార్టీగా జనాలందరికీ టీఆర్ఎస్ పార్టీ పరిచయమం ఎప్పుడో అయిపోయింది. అయితే.. ఇప్పుడు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించేందుకు బీఆర్ఎస్ గా జాతీయ రాజకీయాల్లోకి కొత్త శకం సృష్టించనుంది. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అంటూ వ్యవసాయ రంగానికి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ప్రాధాన్యత ఎంతో చెప్పకనే చెప్పేశారు. వ్యవసాయ ఆధార దేశమైన ఇండియాలో సాగు రంగాన్ని కాపాడుకుంటేనే.. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని నమ్మిన కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని రైతు నినాదంతో ప్రారంభించారు. అయితే.. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించి.. పార్టీ కార్యాలయం ప్రారంభించక ముందే దేశంలో బీఆర్ఎస్ గురించి ఒక పాజిటివ్ చర్చ అయితే మొదలైంది.


డిసెంబర్ 14న కేసీఆర్ ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి మద్దతుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు బీఆర్ఎస్ పార్టీకి స్వాగతం పలికాయి. బీజేపీ పాలనలో నలిగిపోతున్న ప్రజలు.. అణిచివేబడుతున్న ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కి తమ మద్దతును బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ వీధుల్లో భారతీయ రాష్ట్ర సమితి పేరుతో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘దేశ్ కీ నేత.. కిసాన్ భరోసా.. కేసీఆర్ ఫర్ ఇండియా.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాలను ఫ్లెక్సీలో రాశారు. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు కేసీఆర్ ప్రకటించగానే ఏపీ, కర్ణాటకలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేసీఆర్ ఇదొక చక్కని అవకాశంగా కేసీఆర్ రాజకీయ ప్రణాళికలు రచించారు. ఈ నేపథయంలోనే కేసీఆర్ త్వరలో విజయవాడలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంఖుస్థాపన చేస్తారు. జస్ట్ పార్టీని అలా ప్రకటించిగానే.. జనాలు, యువత, మహిళలు బీఆర్ఎస్ పార్టీని ఆదరించడానికి పోటీ ఆదరిస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా.. ఇటు రాష్ట్రాల్లో ప్రజలు ఉత్సాహంగా స్వాగతం చెప్తున్నారు.

 

Leave a Comment