Telangana People Ignore Amit Shah Chevella Public Meeting

అమిత్‌ షా పర్యటనని పట్టించుకోని తెలంగాణ ప్రజలు..!

Share it >>

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన అకాల వర్షంలా సాగింది. వర్షం చేతికి వచ్చిన పంటకు నష్టం చేస్తే…అమిత్‌ షా పర్యటన తెలంగాణ ప్రజల జీవితాలను నాశనం చేసేందుకు వచ్చినట్లు ఉంది. రాష్ట్రంపై విషం చిమ్ముతూ.. ప్రజల మధ్య విధ్వేషాన్ని రెచ్చగోట్టే ప్రయత్నం చేశారు..అన్నదమ్ముల్లా కలిసి ఉన్న హిందూ ముస్లీం వైషమ్యాలు సృష్టించే కుట్రల తెర తీసారు..ఓట్లు సీట్ల రాజకీయంలో రాష్ట్రప్రజలను బలిపెట్టేందుకు ప్లాన్‌ చేశారు.

తెలంగాణపై సవతి తల్లి ప్రేమ

భారత దేశం రాష్ట్రాల సమఖ్య దేశం..ఫెడరల్ స్పూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానిక మధ్య సంబంధాలు చాలా ముఖ్యం దేశ ప్రజల అభివృద్దిలో ఇటు కేంద్రం అటు రాష్ట్రాలకు సమాన బాధ్యతలు ఉంటాయి..పరస్పరం ఒకరికికొకరు సహకరించుకుంటూ ప్రజల కోసం పని చేయాలి..కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెడరల్‌ స్పూర్తికి తూట్లు పోడుస్తోంది..విపక్షలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది..బడ్జేట్‌ కేటాయింపుల దగ్గర నుంచి స్కీమ్‌లను ప్రకటించే వరకూ అన్నింట్లో సవతి తల్లి ప్రేమలను చూపిస్తున్నారు.

బీజేపీ నేతలు వక్రబుద్ది

మరిముఖ్యంగా తెలంగాణ ప్రజలపై బీజేపీ మరింత కక్షపూరింతంగా వ్యవహరిస్తోంది.. కేంద్రం ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలను ఎండగడుతున్న తెలంగాణ ప్రజలను ఆర్ధిక ఇబ్బందులకు గురి చేస్తోంది..చట్టప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా బీజేపీ తన కుటిల బుద్దిని చాటుకుంటోంది..తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే కోట్ల రూపాయాలు ఇస్తం, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తామని…భారీగా నిధులు విడుదల చేస్తామని కేంద్ర బీజేపీ నేతలు వక్రబుద్దిని చాటుకుంటున్నారు..రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే నిధులు ఇస్తారా?.. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉంటే నిధులు ఇవ్వారా ? అంటూ తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు.

విధ్యంసం, విధ్వేషం చుట్టూ అమిత్‌ షా ప్రసంగం

నిన్న చేవెళ్ల సభలో తెలంగాణ ప్రజలపై కేంద్ర హోంమంత్రి విషం చిమ్మారు..తన ఉన్న ఉత్తరాది అహంకారపు మాటలతో రాష్ట్ర ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ ,అభివృద్ధికి కళ్లుండి చూడకుండా గుడ్డివానిగా నటించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారు..రాష్ట్రాన్ని విధ్యంసం చేయడం, ప్రజల్లో విధ్వేషం సృష్టించేలా మతం చుట్టే అమిత్‌ షా ప్రసంగం ప్రసంగం కొనసాగింది..హిందూ ముస్లీంల మధ్య చిచ్చు పెట్టేలా రాష్ట్రంలో ముస్లీంలకు ఉన్న 4శాతం రిజర్వేషన్ల రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని రాష్ట్రంలో అగ్నికి ఆజ్యంపోయే ప్రయత్నం చేశారు.

హిందూ-ముస్లీం మత రాజకీయాలు

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అసత్య విమర్శలు రాష్ట్రప్రజలు లైట్‌ తీసుకున్నారు.. హిందూ-ముస్లీం మత రాజకీయాలు తప్ప బీజేపీ నేతల నుంచి ఇంతకుమించిన రాజకీయ దృక్పథం, దేశాభివృద్ది వారి నుంచి ఆశించడం శుద్దదండగే అవుతుందని రాష్ట్ర ప్రజలు అభిప్రాయ పడుతున్నారు..రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు తెలంగాణకు వస్తే రాష్ట్రప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందని…రాష్ట్రానికి కొత్త ప్రాజక్టులు, నిధులు ప్రకటిస్తారని తెలంగాణ ప్రజలు ఆశించారు….కానీ దానికి పూర్తి భిన్నంగా తెలంగాణలో అమిత్‌ షా పర్యటన సాగింది..మరీ ముఖ్యంగా విభజన సమస్యలతో గత 9 ఏళ్లుగా తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాటిని పరిష్కరించడానికి సమయం లేని అమిత్‌ షాకు బీజేపీ పార్టీని విస్తరించేందుకు ఎక్కువ టైం కేటాయించడంపై రాష్ట్ర ప్రజలు భగ్గుమంటున్నారు.

షా సభతో భంగపడ్డ తెలంగాణ

అమిత్ షా పర్యటనతో తెలంగాణకు ఏమైన మంచి జరుతుందని ఆశించి తెలంగాణ ప్రజలు భంగపడ్డారు..దీంతో తెలంగాణలో అమిత్‌ షా పర్యటనను పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణలో అధికార విక్షాల మధ్య పొలిటికల్‌ వార్‌ ఫీక్‌ స్టేజీలో ఉంది..పక్క రాష్ట్రంలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరుతున్నాయి..ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రుల పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది..సభ జరిగిన తీరుపై సహజంగానే ప్రజల్లో చర్చ జరుగుతోంది..కానీ చేవెళ్లలో జరిగిన బీజేసీ సభపై తెలంగాణ సమాజంలో పెద్దగా చర్చ జరగడం లేదు..అమిత్‌ షా పర్యటనను ప్రజలు పట్టించుకోవం లేదు.

బండి సంజయ్‌, ఈటలను ఏకం చేసేందుకు ప్రయత్నించిన షా

మరోవైపు గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీలో నేతలు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి..బండిసంజయ్‌ ,ఈటల రాజేందర్‌ మధ్య అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి..ఆధిపత్యపోరులో ఈటల, బండి వర్గీయులు ఎవరికి వారు పార్టీలో పై చేయి సాధించేందుకు వ్యూహాలు రచించిస్తున్నారు..అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జరుగుతున్న నష్ట నివారణ చర్యలకు ప్రయత్నించారు..బండి సంజయ్‌, ఈటలను ఏకం చేసేందుకు అమిత్‌ షా సభ వేదికపై నానా తంటాలు పడ్డారు..పదేపదే ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌ పేరు ఉచ్చరించారు..టీ బీజేపీలో అంతర్గ కుమ్ములాలు , నేతల మధ్య విభేదాలు లేవని కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం చేశారు.

పేపర్‌ లీక్‌ కేసులో బండిని కాపాడుకునే కష్టపడ్డ షా

తెలంగాణలో లంచలనం సృష్టించిన టెన్త్‌ పేపర్‌ కేసులో బండి సంజయ్‌ A1 నిందితుడుగా ఉన్నారు..విచారణకు సహకరించకుండా దొంగల తప్పించుకు తిరుగుతున్నారు..తోటి సహాచర మిత్రడు ఈటల రాజేందర్‌ పోలీసులకు సహకరించిన బండి సంజయ్‌ మాత్రం సాకులు చెపుతూ తప్పించుకు తిరుగుతున్నారు..తప్పు చేయన్నడు పోలీసుల విచారణకు ఎందుకు సహకరించడం లేదని విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వాన్ని బదునాం చేయడానికి లక్షాలది మంది విద్యార్థల జీవితాలను నాశనం చేసిన బండి సంజయ్‌ను కేంద్ర హోంమంత్రి హోదా సమర్థించడంపై తెలంగాణ సమాజం మండిపడుతోంది..దేశంలో బీజేపీ పార్టీ ,కేంద్ర ప్రభుత్వం వైట్‌ కాలర్‌ నేరాలను ప్రొత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈటల నష్ట నివారణ చర్యలు

తప్పుడు ప్రచారం అయిన పదే పదే ప్రజల్లో ప్రచారం చేయండి క్రమంగా అదే నిజం అనిప్రజలు నమ్ముతారన్న అమిత్‌ షా వ్యూహాల్ని తెలంగాణలో ఈటల రాజేందర్‌ అమలు చేసి తెలంగాణ ప్రజల దృష్టిలో విలన్‌గా మిలిగిపోయారు..ఉద్యమకారుడిగా ఎంతో మంచి పేరు సంపాదించిన ఈటల..బీజేపీలో చేరి తెలంగాణ ప్రజల ద్రోహిగా మిగిపోతున్నారు.. మునుగోడు బైపోల్‌లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ 25 కోట్లు ఇచ్చిందని అమిత్‌ షా మాటలను ప్రచారం చేశారు..టీకాంగ్రెస్‌ అధ్యక్షుడు ఈటల ఆరోపణలపై ఘాటుగా స్పందించడంతో బీజేపీ నేతలు వెనక్కి తగ్గారు..బండి సంజయ్‌ ,ఈటల నష్ట నివారణ చర్యలు దిగి రేవంత్‌ రెడ్డిని అనలేదని..కాంగ్రెస్‌ పార్టీపై మాత్రమే ఆరోపణలు చేశామని తప్పించుకునే ప్రయత్నం చేశారు..ఇంకోవైపు కాంగ్రెస్‌పై ఈటల ఆరోపణలతో టీబీజేపీకి జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కేంద్రహోం మంత్రి అమిత్‌ షా కూడా చేవెళ్ల సభలో కష్టపడ్డారు.

2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్‌ ఎన్నికల ఎజెండాను ప్రకటించిన అమిత్‌ షా

ఇంకోవైపు తెలంగాణలో బీజేపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడమే కాకుండా…వచ్చే అసెంబ్లీ ఎన్నికలు…2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో కమలం పార్టీ తమ స్టాండ్‌ను అమిత్‌ షా తెలిపారు..తెలంగాణలో కులాల కుంపట్లు, మత మారణహోమమే బీజేపీ ఎజెండా అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు..వచ్చే ఎన్నికల్లో హిందూ ముస్లీం కేంద్రంగానే బీజేపీ ఓట్ల రాజకీయం ఉంటుందని చేవెళ్ల సభలో అమిత్‌ షా కార్యకర్తలకు హీత బోధ చేశారు..

కులాల కుంపట్లు, మత మారణహోమమే బీజేపీ ఎజెండా

2019లో కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ, అమిత్‌ షా దేశంలో కొన్ని మతాలను, కొంతమంది ప్రజాస్వామ్య వాదులను లక్ష్యంగా తమ వూహలు అమలు చేస్తున్నారు..అందులో అగ్రభాగంలో ముస్లీం కమ్యూనిటీ ఉంది..భారత దేశం నుంచి ముస్లీంలను పూర్తిగా వెలివేయడం లేదా..వారిని అగ్రకులాల బానిసలుగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారు..మైర్టీలకు వారికి ఉండే హక్కులను ఒక్కొక్కటి బీజేపీ రద్దు చేస్తోంది..ముస్లీం పిల్లలు చదువుకోకుండా అనేక అడ్డుంకులు సృష్టిస్తున్నారు.. హిజాబ్‌, బురాఖతో ముస్లీం విద్యార్థిలను విద్యకు దూరం చేస్తోంది..మదర్స్‌లకు నిధులు ఇవ్వకుండా వాటిని రద్దు చేస్తున్నారు..మొత్తానికి ముస్లీం అంటే దేశ ద్రోహి అనే ముద్ర వారి కమలనాథులు వేస్తు ప్రచారం చేస్తోన్నారు..ముస్లీం ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలను అధ్యయనం చేయకుండ వారిని టెర్రరిస్టులు, ఉద్రవాదులగా తయారు చేస్తూ బీజేపీ ఓటర్‌ పోలరైజేషన్‌తో రాజకీయ లబ్ది పొందుతోంది.

టార్గెట్‌ గా ముస్లీం కమ్యూనిటీ

దేశంలో ముస్లీం కమ్యూనిటీని టార్గెట్‌ చేసిన బీజేపీ, తెలంగాణలోనూ అదే వ్యూహం అమలు చేస్తోంది..వచ్చే ఎన్నికల్లో కూడా అదే వ్యూహాలతో వెళ్లాలని క్యాడర్‌ కు షా సూచించారు..రిజర్వేషన్ల పేరుతో రాష్ట్రంలో హిందూ ముస్లిం మధ్య మతచిచ్చు పెట్టి విభజన రాజకీయాలకు తెర తీయాలని నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు.. ఒకవైపు ముస్లింలు రిజర్వేషన్ ను తొలగించి ఎస్సీ,ఎస్టీ, బీసీ లకు కేటాయిస్తామని ప్రకటించి వెనుకబడిన తరగతుల ప్రజలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.. అంతేకాదు రిజర్వేషన్ వివాదాన్ని జఠిలంగా మార్చి దాన్ని రాజకీయంగా వాడుకోవచ్చు అని కమలనాథులు పక్కా స్కెచ్ వేశారు.. ఇంకోవైపు రిజర్వేషన్ల విషయంలో ముస్లింలకు ఎస్సీ ఎస్టీ బీసీ మధ్య గొడవలకు ఆజ్యం పోయడం ద్వారా కుల ఘర్షణలతో పొలిటికల్ లబ్ధి పొందవచ్చని కాషాయ మూక కుట్రలు చేస్తోంది.

రిజర్వేషన్ల పేరుతో హిందూ-ముస్లీంల మధ్య విభజన రాజకీయం

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ , ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటేనని చెప్పే ప్రయత్నం బీజేపీ చేస్తోంది.. ఈ నేపథ్యంలోనే ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని అమిత్ షా తెరపైకి తెచ్చారనే విశ్లేషణ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతోంది.. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ తొలగొస్తామని చెప్పడం ద్వారా సహాజంగానే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలన్నీ తమ వ్యతిరేక వ్యక్తం చేస్తారు.. దీంతో సీఎం కేసీఆర్ హిందూ మత వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అందుకే ముస్లింల రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని రాజకీయ పబ్బం గడుపుతుకోవచ్చని.. ఓట్లు సీట్లు సాధించి అధికారంలోకి రావచ్చని మోడీ, షా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలన్నీ ముస్లింల వైపు ఉంటే.. బీజేపీ ఒక్కటే ఒక హిందువుల కోసం పనిచేస్తుందనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో కల్పించే కుట్రలు కమలం పార్టీ వేస్తోంది..

ముస్లీం రిజర్వేషన్లు తొలగింపు, రేపు ఎస్సీ, ఎస్టీ, బీసీల వంతు

దేశంలో ముస్లిం రిజర్వేషన్ తో బీజేపీ రాజకీయాలు చేస్తోంది.. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఎజెండాలో హిందూ ముస్లిం మధ్య మతచిచ్చు పెట్టడంతో పాటు రిజర్వేషన్ల తొలగింపు అంశం కూడా ప్రధానంగా ఉంటుంది.. అయితే బీజేపీ అనుసరిస్తున్న ఇలాంటి రాజ్యాంగ విరుద్ధం విధానాలపై బాధితులే కాదు మేధావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. రిజర్వేషన్ల తొలగింపు అంటే అది ఒక జాతిని అంతం చేయడానికే అని అభిప్రాయపడుతున్నారు..ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని.. నియంతృత్వ ధోరణిని తొలి అడుగులు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.. దీనిపై ప్రజలందరూ కులమతాలకు అతీతంగా బీజేపీపై పోరాటం చేయాలని హెచ్చరిస్తున్నారు.

రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎంను ఏకం చేసే వ్యూహం

తెలంగాణ సమాజంతో దేశ ప్రజలందరూ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి..జర్మనీలో నాజీల పాలన గురించి మార్టిన్ నీమోల్లర్ న అనే మత గురువు చెప్పిన మాటలు మరోమారు నెమరు వేసుకోవాల్సి సందర్భం..నాజీల పాలన నేటి బీజేపీ నయా నాజీలకు దగ్గర పోలికలు ఉన్నాయి.. ఇద్దరీ లక్ష్యం , ఎజెండా ఒక్కటే.. మతోన్మాదం, నియంతృత్వం వారి టార్గెట్..వాళ్ళు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు.. నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి మాట్లాడలేదు.. తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు.. నేను యూదును కాదు కాబట్టి ఎదురు మాట్లాడలేదు.. తర్వాత వాళ్లు కార్మిక నాయకుల కోసం వచ్చారు.. నేను కార్మిక నాయకుడ్ని కాదు కాబట్టి మాట్లాడలేదు..తర్వాత వాళ్లు కాథలిక్కుల కోసం వచ్చారు. నేను ప్రొటెస్టెంటును కాబట్టి మాట్లాడలేదు..చివరకు వాళ్లు నా కోసం వచ్చారు. అప్పటికి నాకోసం మాట్లాడేందుకు ఎవరూ మిగిలిలేరు..ఇప్పుడు దేశంలో బీజేపీ కూడా అలానే చేస్తోంది.. ముస్లిం రిజర్వేషన్ విషయంలో అందరు కలిసి కట్టుగా ఉమ్మడిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ పై పోరడకపోతే కమలం నేతలు దేశాన్ని నియంతృత్వ రాజ్యాంగ మార్చే ప్రమాదం ఉందని..ఈ రోజు ముస్లిం రిజర్వేషన్ తొలగించిన బీజేపే రేపు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా తొలగిస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు..

హిందూ ఓటర్ల పోలరైజేషన్‌
ఇంకో ఈ రిజర్వేషన్ల తొలగింపు వెనుక బీజేపీ, కార్పొరేట్ శక్తుల దూర దృష్టి,వక్ర బుద్ధి కాడా ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.. దేశంలో వ్యవస్థ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు ఉండాలనే డిమాండ్ ఆయా వర్గాల నుంచి వస్తోంది..అది రాజకీయ పార్టీలు ఉనికిని ప్రశ్నిస్తోంది.. రిజర్వేషన్ల వల్ల ప్రైవేట్ కంపెనీలు, విద్యా సంస్థలు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది..ఈ నేపథ్యంలోనే ముందు ఒక్కొక్క మతం , కులాల మధ్య రిజర్వేషన్లను తొలగించుకుంటుపోతూ చివరి రిజర్వేషన్లే లేకుండా చేయడం ద్వారా అటు కార్పొరేట్ శక్తులకు ఇటు మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఉభయులూ లబ్దిపోందే కుట్రలను కమలం నేతలు వేగంగా ముందుకు తెస్తున్నారంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Leave a Comment