V6 News Channel Lost Its Credibility In Telangana Viewers

కేసీఆర్ తో ఎదిగిన V6, ఇంతలా పతనానికి కారణాలు?

Share it >>

తెలంగాణ గొంతుకగా చెప్పుకునే V6, వెలుగు నేడు తెలంగాణకు గుదిబండగా మారాయి. తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని చూసి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు మన రాష్ట్రానికి వరదలా వస్తున్నయ్, అవార్డుల సైతం ఇస్తున్నయ్.. V6, వెలుగు మాత్రం అవేవి చూపెట్టకుండా తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి.

అయితే ఇక్కడ V6 ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ ఇచ్చే స్పీచులతో వ్యూస్ పొందిన ఛానల్ V6. కేసీఆర్ లైవ్స్ తో సబ్ స్క్రైబర్స్ పెంచుకున్న ఛానల్ V6. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీఆర్ బొమ్మతో ఎదిగిన ఛానల్ V6. తెలంగాణ ప్రదాత సీఎం కేసీఆర్ భిక్షతో ఈ స్థాయికి చేరుకొని ఇప్పుడు కుప్పిగంతులు వేస్తుంది అదే v6.

చైర్మన్ కాసుల కక్కుర్తితో V6 ఆగం

బయటేమో తెలంగాణ పత్రికగా చలామణి అవుతూ.. మోదీ, షా వంటి గుజరాత్ నేతల బూట్లు నాకే వార్తల ప్రచారంతో కాషాయ రంగు పూసుకున్న V6, వెలుగు.. తెలంగాణ సమాజానికి భారమైంది. బేరం కుదుర్చుకుని V6 మీడియా సంస్థల యజమాని ఎలాగైతే పూటకో పార్టీ కండువా కప్పుకుంటున్నాడో.. v6, వెలుగు కూడా ప్యాకేజీల కోసం తప్పుడు వార్తలని రాస్తూ వస్తోంది. అందుకే ఇప్పుడు తెలంగాణ సమాజంలో V6, వెలుగు మీడియా సంస్థల విశ్వసనీయత ప్రశ్నార్థకమైంది.

కేసీఆర్ లైవ్స్ లో V6 పతనం.. రోజుకో రంగు మార్చడం వల్లేనా??

89 లక్షల సబ్ స్క్రైబర్స్ ఉన్న V6 యూట్యూబ్ ఛానల్ లో కేసీఆర్ స్పెషల్ లైవ్స్ వ్యూవర్ షిప్ ఇప్పుడు దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు కేసీఆర్ లైవ్ మాదే టాప్ అని పత్రికల్లో వేసుకున్న V6లో నేడు కేసీఆర్ లైవ్ వ్యూవర్స్ రోజు రోజుకీ పాతాళానికి పడిపోతున్న విషయాన్ని గమనించుకుంటే మంచిది. అది మానేసి గప్పాలు కొట్టుకుంటే ప్రజలకు గురవింద గింజ సామెత గుర్తొచ్చి నవ్వు కుంటున్నారు. ముఖ్యంగా V6లో కేసీఆర్ లైవ్స్ పడిపోవడానికి కారణం పూటకో పార్టీని సపోర్ట్ చేస్తూ రాస్తున్న వార్తలే. రాజకీయ నాయకుల్లా రంగులు మారుస్తున్న V6పై తెలంగాణ ప్రజల్లో నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లుతోంటే.. మరోవైపు T న్యూస్ యూట్యూబ్ ఛానెల్ లో కేసీఆర్ లైవ్ ని వేలల్లో ప్రజలు వీక్షిస్తున్నారు.

అయితే కేసీఆర్ అనే కటౌట్ లేకుంటే V6, వెలుగుని తెలంగాణలో ఎవ్వడు దేకేవాడు కాదు. V6, వెలుగుకి వచ్చిన పేరు ప్రతిష్టలు అన్ని సీఎం కేసీఆర్ భిక్షనే అని ప్రతి తెలంగాణ బిడ్డకి తెలుసు. తెలంగాణ ప్రజలు చీదరించుకుంటున్న ఈ సమయంలో డైవర్షన్ టాక్టిక్స్ తో సోషల్ మీడియాలో డంబాచారాలు ప్రచారం మొదలుపెట్టింది V6. మా వ్యూస్ ఇన్ని, మా సబ్ స్క్రైబర్స్ అన్ని అంటూ ప్రగల్బాలు పలుకుతూ.. కిందకి పడిపోతున్నా తనదే పై చేయి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది V6.

kcr live in V6

cm live in Tnews
89 లక్షల సబ్ స్క్రైబర్స్ ఉన్న V6ను 8.5 లక్షల సబ్ స్క్రైబర్స్ ఉన్న T న్యూస్ ఢీకొడుతోంది!

కాషాయం పార్టీ ప్యాకేజిల కోసం పనిచేస్తున్న V6కు 89 లక్షల సబ్ స్క్రైబర్స్ ఉన్నా సరే.. కేవలం 8.59 లక్షల సబ్ స్క్రైబర్స్ ఉన్న T న్యూస్ కొన్నాళ్లుగా దీటుగా ఎదుగుతోంది. తగ్గేదేలే అంటూ పోటీ పడుతూ వస్తోంది. తక్కువ సబ్ స్క్రైబర్స్ ఉన్నా.. V6, వెలుగుకి గట్టి పోటీ ఇస్తున్న T న్యూస్ పై V6 అక్కసు వెళ్లగక్కుతోంది. కేసీఆర్ లైవ్ అంటే T న్యూస్, T న్యూస్ అంటే తెలంగాణ అన్న బ్రాండ్ తెచ్చుకుంటోంది T న్యూస్. కాషాయం, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా తెలంగాణ గుండెచప్పుడుగా సోషల్ మీడియాలో T న్యూస్ దూసుకెళ్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల లైవ్, సీఎం కేసీఆర్, మంత్రుల ప్రోగ్రామ్స్ ఇలా ప్రతి దాంట్లోనూ V6, వెలుగుని వెనక్కి నెట్టేస్తూ దూసుకెళ్తోంది T న్యూస్.

KCR Live In T News

Cm Kcr Live In V6

విష ప్రచారాలు ప్రజల్లోకి వెళ్లొదన్నదే కవిత ఉద్దేశం

తెలంగాణ ఎదుగుతున్న తీరుపై, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పై V6 నిరంతరం విషం చిమ్ముతోంది. గుజరాతీ బాస్ లకు గులాంగా మారి.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని కబోదిలా V6 తయారైంది. 89 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్న ఆ సంస్థ.. మీడియాకు ఉండాల్సిన కనీస బాధ్యతను వదిలేసి.. వాస్తవాలను కప్పి పెట్టి.. రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతోంది. దీంతో V6 అబద్ధపు ప్రచారాలు ప్రజల్లోకి వెళ్తే నైరాశ్యం రావొచ్చు.. లేదా ఇతర రాష్ట్రాల వాళ్లను నమ్మించే ప్రయత్నం జరిగితే తెలంగాణపై ప్రభావం పడే చాన్స్ ఉందన్న భయంతో ఎమ్మెల్సీ కవిత గారు ఇటీవల స్పందించారు. తప్పుడు ప్రచారాలను ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలంటే వాస్తవాలను చూపించే T న్యూస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు. నిజం ప్రజల్లోకి వెళ్తే తమను మరింత ఛీదరించుకుంటారన్న భయంతో V6 ఇప్పుడు సోషల్ మీడియాలో చెత్త ప్రచారాలను మొదలుపెట్టింది.

Kavitha-1

Leave a Comment